వీణ (విపంచి)-సాహితీ సింధు సరళ గున్నాల
మ*కరమున్పట్టెనువీణ రాగమొలకన్ కాపాడగావిద్య సు
స్వరముల్పలుకశ్రావ్యమొప్ప
గళమున్సారస్వముప్పొంగగన్
తరముల్మారిన వెల్గులీను సరసుల్ధన్యాత్ములైపొంగుచున్
సురులున్మెత్తురు కచ్ఛపిన్ శ్రవణముల్శోభిల్లగామోదమున్

ఉ*భారతిచేతవెల్గుచునుభాసిలుచుండెడివీణమాధురుల్
శూరతజూపురాజులును శ్రోతగగ్రోలును సుస్వరావళిన్
ధీరతపంచుదేవతలు తీరికవేళ విపంచి రాగముల్
కేరువుతోడవిందురట క్షీణముగాని రసమ్ము గ్రోలుచున్


కామెంట్‌లు