1.వినన్నవాడికి చెప్పడం,
లోకువ!
అనన్నవాడిని అనిపించడం,
గొడవ!
రాయనన్నవాడిచే,
రాయించడం రగడ!
చదవనన్నవాడికి చదువు,
వింత పోకడ!
2.అభిజాత్యానికి,
విన్నపాలా!
మూర్ఖత్వానికి,
సలహాలా!
జారత్వానికి,
నీతిబోధలా!
చోరత్వానికి,
తనపరబేధాలా!
3. ఎడారిలో ఇసుకదారి!
గోదారిలో ఇంకనిదారి!
దుఃఖంలో ఇరుకుదారి!
బతుకంతా మాయదారి!
4.మనలో మనమాట!
ఎవడు వింటాడు చిన్నమాట!
కోరుకుంటాడు పెద్దమూట!
నడవమంటాడు ఆ బాట!
పాడుతుంటాడు అదే పాట!
5.నిజాయితీ నిండుకుండ!
అమాయకత్వం వాడనిదండ!
మానవత్వం మహిలో నిండ!
లోకమంతా శాంతి పండ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి