మబ్బులు కమ్మీ వర్షం వచ్చే వరి నాటెయ్యాలి
మనము వరినాటేయాలి
ఓహో ఓహో వరినాటేయాలి
మోహము తోడ పొలమును దున్ని వరి నాటే యాలి
తడిసిన పొలమును విడువక దున్ని వరి నాటే యాలి
చెమటలు చిందగ నడుములు వంచి వరి నాటే యాలి
నారు మడులు జర్రున జారును జాగ్రత్తగుండాలి
//మబ్బులు//
కలసి వచ్చిన కలుపు మొక్కలను తీసివేయాలి
బలము తోడ పెరిగేటందుకు మసాలా పెట్టాలి
పొలముల నీరు ఉండే విధముగా తప్పక చూడాలి
చెరుకు మల్లె పొలములు ఎప్పుడు నీటితో ఉండాలే
//మబ్బులు//
కప్పలు ఎలుకలు పాములు పక్షులు రాకుండా చూడాలే
చీడ పీడ పురుగులు ఏమిరాకుండా చూడాలే
వేపనూనెలు కానుగనూనెలు పిచికారి చేయాలి
పసిపిల్లల మాదిరిగా పొలమును చూడాలే
//మబ్బులు//
ఇంటివేల్పును గ్రామవేల్పును మనసున తల్వాలే
బోనంపెట్టి పొలము తల్లికి దండం పెట్టాలే
బంగారుపంట లక్ష్మీరూపేణ ఇంటికి వచ్చేను
ఇల్లు ముంగిలి అందరిముఖములు కలకలలాడేను
//మబ్బులు//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి