సువాసనలు (బాల గేయము)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
సోంపును వేసుకున్నారా 
ఆహారం త్వరగా అరుగునురా
శక్తి యుక్తులు పెంచునురా
ఆరోగ్యాలను పంచునురా 

జీర్ణశక్తులను పెంచేను
దుర్వాసనలే తుంచేను
సువాసనలు తెచ్చేను
నొప్పులు ఎన్నో బాపేను

రసాయనాలను మింగేను
విష ప్రభావము తగ్గించేను
అధిక లావును తగ్గించేను
సోంపే దివ్యౌషధం.