ప్రకృతి భాష ,మనసు దోచిన ఒక పాట-- కె.వెంకట రమణ రావు
 రేడియో లో వస్తున్న పాట వైపు మనసు పెట్టాను. ఆ సాహిత్యం , ఆ కోకిల స్వరం మనసును కట్టేసి మనసుని ఏదో లోతుల్లోకి తీసుకెళ్ళింది. ఎంత మధురమైన వర్ణన. ప్రకృతి తన భాషని  ఎలా  మనకి తెలియ చేస్తుందో ఎంతో చక్కగా చెప్పారు ఆ గీత రచయిత ఈ పాటలో. అందులో  ఆ కవి ఇలా  చెప్తారు ,
వెల్లి విరిసే చల్లదనం వెన్నెల భాష
వెదజల్లే పరిమళం మల్లిక భాష
బోసినవ్వులే పాపాయి మాట
ఇవి మాటలకి,  కవితలకు అందని భాష.
 
పిల్ల గాలి పరుగులో వెళ్లి విరిసే గీతికలు,
కొండవాగు తరగలలో వినిపించే కోటి రాగ మాలికలు,
మన హృదయానికి చెవులుంటే ఈ జగమంతా నాదమయం గా వినిపిస్తుంది.  ఎంత  అద్భుతమయిన ప్రకృతి పరిశీలన.
 
ఇవాళ రోజుల్లో  ప్రకృతిని మనసుతో చూసి అనుభూతి పొందే పరిస్థితులు ఎక్కడ.  ఉరుకులు పరుగుల జీవన శైలి,    సోషల్ మీడియా, మనం  మనసున్న మనుషులం  అన్న విషయాన్ని మర్చి పోయేలా చేస్తున్నాయి.
మనని సాదరంగా గా ప్రతి రోజూ పలకరించే ప్రకృతి మనకు ఒక మంచి నేస్తం ఆ నేస్తం మనకి ఎన్నో చెప్తుంది , ఆ భాష మన .మనసుకి అర్థం కావాలి.  ఎక్కడో అడుగుకి నెట్టేసిన సున్నిత భావాలని పైకి తీసుకు రాగలిగితే జగమంతా నాద మయం బ్రతుకే అనురాగ మయం.
ఈ విషయాన్ని పిల్లల తో పంచుకుని వాళ్లు  ప్రకృతి అందాలను ఆస్వాదించి చక్కటి అనుభూతులను పొందే విధం గా వారి లో సున్నిత భావాలని పెంపొద్దిద్దాము . ప్రకృతి నేస్తం తో సహజీవనం నేర్పిద్దాం.
స్ఫూర్తి:
పాట : మాటలకందని భావాలు
రచయిత.  డాక్టర్ . సి.నారాయణరెడ్డి
గానం : శ్రీమతి  పి.సుశీల
సంగీతం. శ్రీ . ఎస్. రాజేశ్వర రావు
చిత్రం . నీతి నిజాయితీ (1972)
K VENKATA RAMANA RAO
Visakhapatnam
Mobile 9866186864