పిల్లల జీవితం కావాలి బంగారం
శిఖరమంతా ఎదగాలె నవ్వుల సింగారం
ప్రణాళిక లేకుండా ముందుకే పోరాదు
అవగాహన లేకుండా పనిలోకి దిగ రాదు
//పిల్లల//
కోరుకున్న ఆశతో ముందుకే వెళ్లాలి
శ్రమతోనే భవిష్యత్తుకు బాటలు పడతాయి
కార్యసాధనలో పట్టుదల విశ్వాసం
ఎప్పుడు విడువొద్దు ముందుకే
సాగాలి
//పిల్లల //
అలుపెరుగని సాధనయే లక్ష్యానికి తొలిమెట్టు
నిను వెతుకుతూ వస్తుంది విజయం మీ ముందుకు
తల ఎత్తి జీవించు విజయగర్వం తోడ
పది మందికి ఆదర్శం నీవే నీవే
// పిల్లల //
నీ దారిన యువత ముందుకే సాగుతుంది
విజయగర్వంతో జెండా ఎగిరే స్తుంది
భరతమాత పెదవులపై చిరునవ్వులు చిందాయి
దేశ కీర్తి విశ్వమంతా విస్తరించి పారుతుంది
//పిల్లలు//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి