1)
ఒకవూరిలొ సెట్టి కూతురు
వూరంతా ముద్దు చేతురు
రాజేమో బహు కౄరుడు
ఎంత చెప్పినా మారడు!
2)
బంగారురంగు చీర కట్టుకుని
తలలో పూమాల పెట్టుకుని
నుదుట కుంకుమ బొట్టుమెరియగ
అందమంతా మిగుల కురియగ!
3)
నగల కాంతులు మెరిసెకాదా
కనుల కాంతులు కురిసెకాదా
నడకలేమో హంస నడకలు
పలుకులేమో చిలుక పలుకులు!
4)
పళ్ళెములో పళ్ళు పువ్వులు
కడవలలో పాలు పెరుగులు
నవ్వు మొగముతో బయలుదేరెను
అమ్మ గుడికి చేరబోయెను!
(సశేషము)
*కన్యక* (కథ)("రాజశ్రీ"సాహిత్య ప్రక్రియలో):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి