ప్రబోధము(షాడో'స్):---గద్వాల సోమన్న
పచ్చని మొలక
రంగుల చిలుక
తాతకు పిలక
కడు మనోహరం గద్వాల్

పాపాయి అలక
బంగారు గిలక
అందమే కనుక
ఆలరించు హృదయాలు గద్వాల్

ఏటిలో చేప
కంటిలో పాప
నేలపై చాప
వాటివాటి స్థలములు గద్వాల్

హెచ్చితే అహము
జీవితం

హతము
వినుమోయి హితము
ఆరోగ్యదాయకము గద్వాల్

చెప్పుడు మాటలు
నిప్పుల మూటలు
ఎండిన తోటలు
కొరగానివి బ్రతుకున గద్వాల్