ఆత్మీయతలు-అనుబంధాలు,భవిత(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

       :ఆత్మీయతలు-అనుబంధాలు:
మనసు నిండుగా యుంచాలి మమత సమత
బంధ అనుబంధ భావాలు భాగ్య మవగ
కష్ట సుఖముల యందును కలిసి మెలిసి
నిలువ వలసిన గుణములు నిజము గాదె
                    :భవిత:
ప్రాణ దాతల కోసము ప్రాకు లాట
గీము‌ దాటిన‌ వారికి గీత యందు
రాత ఏమున్న దోయని రాజ ప్రశ్న
మాత దిక్కని‌ తలచును మాన‌ సములు
కామెంట్‌లు