రామప్ప రమణీయం:-కదుగాయ.చందర్ రావు.(రోజా పతి)
ప్రపంచ వారసత్వము
చారిత్రక ఆలయము
కాకతీయ వంశజులు
పాలనకమనీయము! 
శిల్ప కళా వైభవము
రామప్ప దేవాలయము!! 

గణపతి దేవుడీ
సైన్యాధిపతికుడు
కాటయ కుమారుడు
రేచర్ల రుద్రుడు! 
రామప్ప కోవెలను
కట్టించిన ఘనుడు!! 

భూకంపం వచ్చినా
కూలిపోనికోవెలిది
దీపకాంతిలేకయును
వెలుగు పడుమంటమిది! 
అష్టభుజినటరాజు
అద్భుత హావ భావము!! 

మందిరపు మంటపమున
రామలింగేశ్వరుడు
మెడపట్టీలు,గంటలతొ
దృఢబలనందీశ్వరుడు! 
చెవులు నిక్కబొడుచుకుని
ఎదురు చూచు నట్లుండు!

ఏకశిలా నమూనాగ
త్రికుట కారకుడ్యం
శతాబ్దాల సాక్ష్యముగా
కాకతీయుల కట్టడం! 
ప్రసిద్ధి కళాక్షేత్రం
పాలంపేటకుదక్కినది!! 

విశాలమైన చెరువున
వ్యవసాయం సాగింది
తటాకాలు,గుళ్లతో
తెలగాణతరించినది! 
ప్రపంచ పరమందున
ప్రఖ్యాతి గడించినది!! 

చూపు తిప్పనీయనీ
శిల్ప సాలభంజికలు
గిలిగింతలు కలిగించు
మృధుమదనికరూపాలు! 
శిల్పాలనృత్యశైలి
శివ తాండవ భంగిమలు!! 

నీటిలొతేలెడుఇటుకలు
సన్నపు ఇసుకతొపునాది
పదకొండుఏళ్ళప్రయత్నం
ఫలించిన శుభసమయమిది!             
ముప్పది తొమ్మిదవ ఘనత
భారతరామప్పచరిత!! 

మనదేశ నిర్మాణాలు
సోయగం, చరిత్ర గాను
యునెస్కో గుర్తింపు తో
విశ్వమెల్లభాసిల్లెను! 
శిల్పి రామప్ప పేరు తో
ఏకైక దేవాలయం!! 

కాకతీయ కళా కృతులు
ఖండాంతరందాటింది
వారసత్వ సంపదగా
రామప్పకేదక్కింది! 
తరతరాల తార్కాణం
తెలంగాణ కీర్తి మకుటం!! 

వేయినూటిరువైమూడు
వారసత్వ సంపద ఇది
ప్రపంచ కళా సాంస్కృతిక
భారత ముప్పది తొమ్మిది! 
ఎనిమిది వందల ఏళ్లుగ
తెలంగాణలో మొదటిిది!! 

నలుబదేళ్ళుశ్రమించిన
శిల్పులకువందనాలు
సేనాధిపతి రేచర్ల
రుద్రునికీజేజేలు! 
సామాజిక జీవితాన్ని
సాక్షిగా నిలిచిన దృశ్యం!! 



కామెంట్‌లు