వెన్నెల రాత్రులు--గద్వాల సోమన్న, గణి తోపాధ్యాయుడు, యెమ్మిగనూరు

వెన్నెల రాత్రుల్లో
పరవశించు మనసులు
చల్లని పందిట్లో
పులకించు తనువులు

పున్నమి రోజుల్లో
పుడమి వెలుగుల పరుపు
వెన్నెల చినుకుల్లో
సృష్టికి ఆటవిడుపు

గుండ్రని చందురుడు
కనువిందు చేయును
గగనమ్మ ఒడిలో
రాత్రంతా తిరుగును

గాఢాంధకారమే
వెన్నెల లేని రాత్రి
పనులకు విఘాతమే
బోసిపోవును ధాత్రి