అడ పిల్ల ఆక్రందన :--------తొగర్ల సురేష్.

 @అర్ధ రాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన్నాడే 
నిజమైన స్వాతంత్ర మన్నాడు బాపూజి 
@ఎప్పుడొస్తుండలాంటి స్వతంత్రమని 
@సిగ్గు లేని జనాన్ని నిగ్గు తేల్చ నిలబడింది నేటి మహిళ 
@వనితను నింగిలోని నక్షత్రమన్నారు 
@ఆకాశంలో అర్ద భాగ మన్నారు 
@బాల్యంలో బడిలో మనమంతా 
@సోదరా సోదరీమణులమని 
చేసిన ప్రతజ్ఞ మరచి పోయారు, 
@కలకంఠి కన్నీరొలికిన 
అది వినాశనానికే నాంధి 
యన్న 
@ఆర్యోక్తిని మరిచిరి మూర్ఖులు,  
@మానవ మృగాలు రేయింబవళ్లు వెంటాడుతునే ఉన్నాయి 
@కామాంధులు అనునిత్యం వేటాడుతునే ఉన్నాయి 
@ఈ గండభేరుండాల ఘోరాలు ఆగే వరకు 
@ఈ తోడేళ్ళ మందను మంట కల్పే వరకూ 
@మన పోరాటం ఆగొద్దు 
@మన ఆరాటం నిలవొద్దు 
అందుకే *
@అరబ్ దేశాల చట్టాలకు 
స్వాగతం పలుకుదాం 
@అంతవరకు మనమంతా 
పోరాటం సాగిద్దాం., 

కామెంట్‌లు