మంచిని కోరే వాడే హితుడు స్నేహితుడు,కష్ట సుఖముల యందు తోడై నీడై యుండును,పతనమైన పైకి తెచ్చి తాను తినేది ఇచ్చు,సజ్జనుడే మిత్రుడయితే సద్ది మూట సాయమురా,స్నేహానికి అడ్డురాదు ధనిక బీద తనము రా,మిత్రుని పై నిందలనిందలేస్తే తొందరపడినమ్మడురా, అక్ర మార్గమును మిత్రుడు అనుసరిస్తే ఓర్వడు రా.సిరి వచ్చిన ముర వద్దుహితుని ఎప్పుడు విడవద్దు,ఆపదలో ధైర్యమిచ్చి అడుగు వెనక్కేయెద్దు,అడగకుండానే సాయం చేసినోన్ని మర వద్దు,కడదాకా నిలుచును సజ్జన స్నేహం బుర.
"స్నేహితుడు":-వై నీరజారెడ్డి తెలుగుభాషో పాధ్యాయురాలు, జడ్పీహెచ్ఎస్ కుకునూరుపల్లి, మండలం కొండపాక ,జిల్లా సిద్దిపేట,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి