మనోబలం :-సామల కిరణ్--పద్యకవి, రచయిత- కరీంనగర్.

 ఒంటరిని నేనని
వెంటెవరు లేరని
గమనంలో విసిగిపోవద్దు....
గమ్యం చేరేందుకు ఆగిపోవద్దు....
గగనమెంత విశాలమో
సాగరమెంత విశాలమో
ఓ సారి పరికించి చూడు!?
పయనానికి పనికొచ్చే పాఠాలెన్నో తెలుసుకో!!
పక్షి ఎగరగల్గింది..
చేప ఈదగల్గింది...
పక్షికున్న చక్షువు నీకు లేదా!
చేపకున్న చేవ నీకు లేదా?
ఎంత దృష్టి పక్షికుందో
ఎంత నిబ్బరం చేపకుందో
తెలుసుకుంటే
తేటతెల్లమగును..
జీవిత పాఠాలెన్నో.. ఎన్నోన్నో....
ప్రతి మనిషి
ఆత్మచక్షువు తెరవాలి..
ప్రతి మనిషి
మనోబలం నిలపాలి..