నెల్సన్ మండేలా -మెరుపులు :--. ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

గుండెలు మండేలా 
అరచిన నల్లజాతివజ్రము 
గొంతులు పగిలేలా 
ఆక్రోశించిన విప్లవశంఖము !

జాతివివక్షత సామాన్యమై 
అణిచివేత అధికారంగా 
ప్రజాస్వామ్యం శూన్యమై 
నిత్యము ప్రజాపోరాటంగా!

చిన్నన్యాయం కోసమే 
ఏళ్ళతరబడి నిరీక్షణము 
స్వజాతి హక్కులకోసమే 
కారాగార వాసము !

శాంతిఅహింసల బాటలో 
సత్యాగ్రహం లక్ష్యంకోసం 
హింసనుండి అహింసలో 
మారినది సయోధ్యకోసం !

అత్యున్నత నోబెలువరించి 
భారతరత్న పురస్కారంతో 
జాతికి మేలుకలిగించి 
విశ్వసత్కారాలు అవార్డులతో!

ఎన్నదగిన శాంతిదూత
నెల్సన్ మండేలా 
నిలిచినాడు ఘనచరిత 
ప్రపంచమే మెచ్చేలా !!