" అమ్మ ";-వై నీరజారెడ్డి. తెలుగుభాషో పాధ్యాయురాలు. జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి .మండలం కొండపాక. జిల్లా సిద్దిపేట.
తొలి పొద్దు పొడిచీ పొడవక ముందే,
 పోర క్కట్టతో వాకిలి నూడ్చి,
 కల్లాపి జల్లి ముగ్గులు వెట్టి, ఇంటిని శుభ్రం చేస్తుంది. 

వంటింట్లో దూరి వంట కై,
 పాత్రలతో యుద్ధం చేస్తూ, 
వండడం పూర్తి చేసి, ఇంటిల్లిపాదికీ వడ్డిస్తుంది, 

పిల్లలను బడికి పంపడానికి,
 భర్త ఆఫీసు కొరకై ,నానా హైరానా పడుతూ ,
గడియారం ముల్లు లా పనిచేస్తుంది. 

అమ్మ అనే కమ్మని పిలుపు, ఆమె 
గుండె తలుపు తట్టి, అలసట 
అంతా మరిచే, వెల కట్టలేని గొప్ప అనుభూతి. 


కామెంట్‌లు