కొక్కొ రొకో కోడి పుంజు
కూత ఉంది భలే రంజు
పొద్దున్నే లేవాలోయ్
అంటూనే మనసు గుంజు!
సమూహమున మహారాజు
యజమానికి యమా మోజు
రంగు రంగు రెక్కలతో
రాజసమే రోజు రోజు !
పోరాటం మగధీరా
బాహుబలి మనమేరా
జూలు విప్పి పౌరుషమే
చాటునిక పల్నాడురా !
పల్లెటూరు అందమిదే
త్యాగానికి బంధమిదే
బ్రతుకుకు అర్థం తెలిపే
స్వచ్ఛమైన జీవి ఇదే !
సంకురాత్రి సందళ్ళను
అన్నిటికీ అలరించును
పెంచిన మమతలు మరిచిన
విందుగ నోరూరించును!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి