తెలుగు తేనియలు (ప్రక్రియ ):---కన్నీరు :- ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

హృదయం లో వేదనలనీ 
మనసులోని  కల్మషములనూ 
కడిగేసేదిగ  కన్నీరు 
గుండెకూడ తేట పడునూ!

పశ్చాత్తాపము చూపించు 
సహృదయంగా తలపిస్తూ 
మనం మనం ఒకటేననీ 
ఆహ్లాదమును కలిగిస్తూ !

ఆత్మీయులతో ఎడబాటు 
ఆవేదన కారణమవును 
తిరిగి కలిసిన నిమిషంలో 
ఆనంద భాష్పము లొలుకును!