గురువు:*--కట్టరంజిత్ కుమార్*

 *(01) కం.*
*గురువే మిత్రుడు , బంధువు*
*గురువే మనతోడు నీడ కువలయమందున్*
*గురువును మించిన దైవము*
*ధరణిని వెదుకంగ లేదు తథ్యము సుమ్మీ!!!*
*(02) కం.*
*దండమయా గురుబ్రహ్మా*
*దండమయా విష్ణుమూర్తి దండముజేతున్*
*దండమయా గురు శివుడా*
*దండమయా గురుసమముకు దండములిడుదున్!!!*
*(03) కం.*
*కరుణనుకురిపించి భువిని*
*సరియగు జ్ఞానంబునింపి , ఛాత్రులమదిలో*
*నిరతము కొలువొందుదువే*
*గురువర నాకెపుడు మీరె గొప్పనియందున్!!!*
*(04) కం.*
*అజ్ఞానము దొలగించియు*
*విజ్ఞానమునందజేసి , విలువలునేర్పున్*
*సుజ్ఞానము శ్రేష్ఠంబని*
*ప్రజ్ఞాశాలిగ మనలను పట్టుగమార్చున్!!!*
*(05) కం.*
*గురుశిష్యులబంధమ్మిది*
*చరితనుసృష్టింపజేసె సత్యమ్మిదియే*
*తరగని విద్యానిధులా*
*భరణమ్ములు ,  నొజ్జకొసగు ప్రతిక్షణమందున్!!!*

*(06) కం.*
*చదువులపరమార్థంబును*
*వదలక శిష్యులకుజెప్పు బాధ్యతతోడన్*
*ముదముగ సంభాషించియు*
*విధులను నెరవేర్చుచుండి విజ్ఞతజూపున్!!!*

*(17) సీ.*
*అజ్ఞానతిమిరాలనంతంబు గావించి*
*విజ్ఞానమందించు వేత్తగురువు*
*ఆత్మవిశ్వాసమ్మునాత్మస్థైర్యమ్మును*
*సంకల్పబలమిచ్చు సతముగురువు*
*క్రమశిక్షణనునేర్పి కర్తవ్యదీక్షతో*
*విలువలుబోధించి వెలుగుగురువు*
*సంస్కారయుతముగా చదువులసారాన్ని*
*ఛాత్రులకొసగెడి జయముగురువు*
*తే.గీ.*
*సత్యపథమున పయనించు సద్గుణుండు*
*కల్మషములేని నిస్వార్థ ఘనబుధుండు*
*సత్ప్రవర్తన, త్యాగము ,సహనగుణము*
*అతనివెన్నంటియుండెడి యాస్తిపాస్తి!!!*


కామెంట్‌లు