వావి వరుసలేదు ,వయసుతో పనిలేదు ,
మెదడు పుచ్చిపోయే పిచ్చిఆలోచనలతో ,
మృగమయ్యేకదా మగవాడు ఈనాడు !
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము...!!
----------------------------------------------------------------
మొక్క నాటలేడు ,మ్రాను పెంచలేడు ,
అడవులన్ని నరుకు మొనగాడు మనవాడు !
పచ్చదనము పొయే ,ప్రాణవాయువులేదాయే ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
------------------------------------------------------------------
మనిషికొక్కమొక్క నాటిన చాలును
కోట్లమొక్కలు పెరిగి పచ్చదనము పంచు !
సాలుకొక్కరోజుచాలునా సర్కారు పనితీరు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
-------------------------------------------------------------------
మిద్దేసాగులోన మొక్కలెన్నో పెంచి
ఇంటిల్లిపాదికి సరిపడెడు కూరగాయల పంట !
తాజాకూరలకు తరుణులు సంతసపడే గదా ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
-------------------------------------------------------------------
సర్కారు నిత్య,మంచి -నీటిసరఫరా
సకలజనుల దాహార్తి తీర్చును దండిగాను !
పైపు లీకేజిలతో రోడ్లు నదులుగా మారే
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------------
దినము మార్చి దినము సరిపోయే నీటిసరఫరా
ప్రతిరోజు నీరిచ్చి సంబరపడె ఇపుడు ప్రభుత !
సద్వినియోగముకాని సరఫరా అదియేల మేలు ?
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
-------------------------------------------------------------------
వేసవివచ్చే ,తోడుగావేడిగాలులు వీచే ....,
చల్లద నము కోసమై ఏ.సీ లు మొదలయ్యే!
పవరు బిల్లు చూసి ఉక్కబోత వుడుకొచ్చే...
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
--------------------------------------------------------------------

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి