1)
ఒక వూరిలొ యువకుడు
మాతాపితలే దేవతలని ఎంచువాడు
మాతాపితలు ఇరువురు గిట్టిరి
యువకుని ఇంటిలోన పుట్టిరి!
2)
పూర్వజన్మ లోని కర్మఫలము
అనుభవించ కలదు ఇంకోజన్మము
తండ్రి పుట్టె వృషభమై
తల్లి పుట్టె శునకమై!
3)
వీరిద్దరు సుతునింట పెరిగిరి
సుతుడు తన పిల్లలిద్దరి
పేర్లను తలిదండ్రుల పేర్లిడెను
ప్రేమ మీర పిలుచుచుండెను!
4)
తల్లిదండ్రులు తమపేర్లను పిలువగవినిరి
ఎంతప్రేమ తమపైన సుతునికిఅనుకొనిరి
ఒకరోజున తలిదండ్రుల శ్రాధ్ధమువచ్చెను
జంతువులా రెంటియెదలు గర్వానుబ్బెను!
(సశేషము)
*అనుభవం* (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో):- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి