( 2018)
ఉదయం పూట నడక
ఆ తరువాత అంతా పరుగే.
నడవాలంటే కొంత మందికి కాఫీ పడాలి
నాలాంటి వాడికి గరమ్ చాయ్ పడాలి.
గరమ్ చాయ్ పడితే తప్ప నడకకి ఉత్సాహం రాదు.
కప్పు గరమ్ చాయ్‌తోనే ఉత్సాహం వస్తుందా
మనస్సులో నడవాలన్న కోరికతో ఉత్సాహం ఉంటుందా?
గరమ్ చాయ్ కానీ, కప్పు కాఫీ గానీ కోరికను ద్విగుణీకృతం చేస్తుందా?
కోరిక కలుగజేస్తుందా?
ఈ రెండింటిలో ఏది సత్యం.
గరమ్ చాయ్‌తోనే మనం నడకగానీ, ఆ రోజు సాధించాల్సిన విజయాలు, పనులు గానీ ముడిపడి ఉన్నాయా?
ఎప్పుడైనా జీవితం విసుగెత్తినప్పుడు, బలమైన కోరికలు లేనప్పుడు గరమ్ చాయ్ గానీ కప్పు కాఫీ గానీ మనల్ని పరిగెత్తిస్తుందా?
నడవాలన్నా, జీవితంలో పరుగెత్తాలన్నా, మనకి కొన్ని లక్ష్యాలు వుండాలి. కొన్ని పనులు సాగించాలన్న బలమైన కోరికలు వుండాలి.
ఇవి వున్నప్పుడు-
కప్పు కాఫీతో పనిలేదు.
గరమ్ చాయ్‌తో పనిలేదు.
నడవాలన్న కోరిక బలంగా వుంటే చాయ్ లేకున్నా పరుగెత్తగలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి