సీసమాలిక పద్యం
సరయు నదీతీర సామ్రాజ్య దేశము
యీయయోధ్య వెలిసె యిమ్ము గాను,
రఘు వంశ తిలకుడు రామ చంద్రుని తండ్రి
దశరథ మహరాజు ధర్మమూర్తి,
కోసల దేశాన్ని కూర్మితో పాలించి
ప్రజల బాధలు తీర్చె రాజ్యమందు,
భోగభాగ్యాలతో భూలోక స్వర్గమా!
యనునట్లు పాలించె యద్భుతమ్ము,
సంతాన లేమితో సతమతమవ్వగన్
కులగురువు వశిష్టు కోర్కెమీర,
తలపెట్టెయజ్ఞము దశరథ రాజుయే
ముగ్గురు భార్యలు మోదమలర,
దివ్యతేజస్సుతో దివ్య పురుషుడొచ్చి
పాయస మందించె పడతులకును,
రామలక్ష్మణులును రమ్యమై వెలుగొందె
భరత శత్రుఘ్నులు వరముగాను.
ఆటవెలది
శబ్దభేది విద్య చక్కగా నేర్చియు
వేట నందు మిన్న వీరు లైరి
శ్రవణ కుడిని జంపి శాపమ్ము పొందగన్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి