దార్శనికులు కలాం ;--సాహితీసింధు సరళ గున్నాల
కం*కలలనుకనమనిజెప్పియు
కలవీడగనిజము జేయు కష్టముసలుపన్
తలపందున పట్టుదలయు
తలరాతనుమార్చిగెలుపు తలుపునుదట్టున్

సీ*పల్లెటూరునబుట్టి పత్రికల మ్ముచు
గెలుపుకోసమునుతానలుపులేక
విద్యలందుకొనగ వేవేలపొత్తముల్
చదువుకొనెడి జ్ఞాన బుధుడుతాను
దినరాత్రములలోన తిప్పలన్నిపడగ
పట్టుబట్టియుతాను ప్రతిభజూపి
పరిశోధనలలోన పాండితీ గరిమనం
దుకొనిన విజ్ఞాన తోటతాను
ఉన్నతంబైనట్టి యుద్యోగమునుపొంది
రాష్ట్రపతిగ తా రాజ్యమేలి

భారతీయతచాటగా బంధువయ్యి
ధర్మ నిరతిని నిలిపెడి ధార్మికుండు
ప్రేమబంధువై నిలిచియు ప్రీతిబంచి
బాటచూపించగ ప్రగతి మూటతాను


కామెంట్‌లు