గొడుగు - మార్క్ ట్వైన్:-- యామిజాల జగదీశ్

 ఆయన ప్రముఖ రచయిత మార్క్ ట్వైన్. తన దగ్గరున్న ఓ పాత గొడుగు ఇక అక్కర్లేదని చెత్తకుండీలో పడేసారు.
అయితే పొరుగింటి మనిషి ఆ గొడుగుని తీసుకొచ్చి "ఎవరో మీ గొడుగుని చెత్తకుండీలో పడేసారండి" అని మార్క్ ట్వైన్ కి ఇచ్చేసెళ్తారు.
మరుసటిరోజు మార్క్ ట్వైన్ ఆ గొడుగుని ఓ పాడుబడ్డ బావిలో పడేసారు. 
అయితే బావిని శుభ్రం చేసిన ఓ మనిషి ఆ గొడుగుని తీసుకొచ్చి "ఎవరో మీ గొడుగుని బావిలో పడేసారండి" అని ఇచ్చేసెళ్తాడు మార్క్ ట్వైన్ కి.
ఒళ్ళు మండిన మార్క్ ట్వైన్ ఆ గొడుగుని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తారు. 
ఆయనకు ఓ మెరుపులాంటి ఆలోచన తళుక్కుమంది. 
మరుసటిరోజు ఉదయం మార్క్ ట్వైన్ ఓ మనిషిని పిలిచి "ఇదిగో ఈ గొడుగు తీసుకో" అని ఇచ్చెస్తారు. 
అతను మార్క్ ట్వైన్ లాంటి ప్రముఖ రచయిత తనకు గొడుగిచ్చాడు కదాని మహదానందంతో దాన్ని తీసుకుపోయి దాచుకుంటాడు. 
అంతే ఆ తర్వాత ఆ గొడుగు మార్క్ ట్వైన్ దగ్గరకు చేరలేదు.