1.బతుకు బీజం!
రూపం మూలం!
అడుగుజాడ మార్గం!
ఆయననీడే దుర్గం!
2.నాన్నవిలువ ఎంతటిది?
నేను నాన్నయ్యాక తెలిసింది!
కుటుంబమంటే తపన!
నిరంతరం యమయాతన!
అనితరసాధ్యం ఆ సాధన!
3.గీతలమధ్య జీవితం!
గీతాసారం జీవనం!
మాటే వజ్రం!
హృదయం నవనీతమే!
అది కరిగి ఆజ్యం!
సంసారయజ్ఞానహోమద్రవ్యం!
4.నాన్న చిందించిన స్వేదం!
నా భుక్తి అర్హత!
కీర్తి సాంద్రత!
ముక్తి యోగ్యత!
నాన్న నాకు నడిచే వేదం!
5.నాన్నకి నేను చేసిన విధి!
నాకందించింది పుత్రనిధి!
నా కొడుకు నా నాన్నే!
నా నాన్నకే నేను నాన్ననయ్యా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి