పేదరికమనినశాపము కాదు ,
పేదవాడి జన్మ పాపమేకాదు ,
కష్టపడిన వాడే కారణ జన్ముడు !
వినుము కె .ఎల్వీ మాట నిజము సుమ్ము !!
------------------------------------------------------
పేదవాడిగ పుట్టి ఉండవచ్చు
పేదరికము నీ- నేపధ్యంకావచ్చు ,
పేదవాడిగా బ్రతుకుట నీ తప్పిదమ్ము !
వినుము కె .ఎల్వీమాట నిజము సుమ్ము !!
----------------------------------------------------------
కష్టమువెనుక నే,సుఖము వెంబడించును ,
సుఖమునకు మార్గ దర్షి కష్టమే సుమా,!
తెలిసిరావలెనీ ,నీతిసూత్రమందరికి,
వినుముకె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము!
------------------------------------------------------------
మంచివాడి మాట కఠినంగావుండును ,
మాయగాడి మాట తేనెలొలుకు !
నిలకడగా తేలును నిజస్వరూపము ,
వినుఁముకె .ఎల్వీ .మాట ,నిజము సుమ్ము !!
----------------------------------------------------------------
గుంటనక్క చూపు స్వార్ధపరుడి సొత్తు ,
మనస్సువిప్పిచూచు చల్లనయ్య ...!
చూపులో తేడాలు తెలుసుకో సొదరా ,
వినుము కె .ఎల్వీ .మాట నిజము సుమ్ము !!
----------------------------------------------------------------
గుణవంతుడెప్పుడూ గౌరవించి మాట్లాడు ,
గౌరవమన్ననేమో తెలియదు దుష్ట మతి కి !
ఇచ్చి పుచ్చుకొనుటలోని,ఆనందమే వేరయా,
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము..!!
------------------------------------------------------------------
చెప్పుడు మాటలువిని చెలరేఁగి పోదురు
చక్కని సంసారము చెడగొట్టుకుందురు ,
మాటల వెనుకనున్న మర్మము తెలుసుకోవలె !
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
-----------------------------------------------------------------
చదువు- సంధ్యలు చూపించు బ్రతుకుబాట ,
తల్లిదండ్రులు నేర్పించు మంచి -మర్యాద ...!
మనసుపెట్టని బ్రతుకు మసిబారిపోవురా ....
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి