బాలలు-బాల్యము(షాడోలు):---గద్వాల సోమన్న

బాలల మనసులు
వెలిగే సూర్యులు
బంగరు గొలుసులు
పిల్లలున్న లోకం గద్వాల్

రేపటి పౌరులు
భువిలో  వీరులు
ముద్దుల బాలలు
నడిపించే నేతలు గద్వాల్

అందము బాల్యము
మిక్కిలి భాగ్యము
ఎంతో శ్రేష్ఠము
చీకూచింత లేదు గద్వాల్

తీయని  స్మృతులు
మరవని కలలు
సిరిసంపదలు
బాల్యమంటే గొప్పది గద్వాల్

స్వార్ధం లేనిది
అర్ధం ఉన్నది
ఎంతో మిన్నది
మహోన్నతం బాల్యము గద్వాల్