తెలుఁగు బిడ్డలమధ్య విభేదాల సృష్టి
ముదిరిపోతున్న జలవివాదాలతృష్ణ !
జలయుద్ధభేరీలు జగడమునకు దారికారాదు ,
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము...!!
------------------------------------'--------------------------
త్రాగు నీరనుచుగొంతెత్తి మాట్లాడునొకపెద్ద
సాగునీ ర నుచు కయ్యమునకు దిగు మరొక డు !
ప్రజలమధ్య ఈచిచ్చు పదికాలాలపాటు నడుచు
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
స్వార్ధ పరుల మూక స్వప్రయోజనాలకై
సిగ్గు ఎగ్గు లేక చిందులేతురు చూడు ...!
ప్రజాసేవ ముసుగులో వృత్తి రాజకీయం సుమా
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము !!
----------------------------------------------------------------
ఉచిత ముచితమనెడిమాటలతో మత్తు పుట్టించి ,
సామాన్యుడి మెదడును పురుగులాతొలిచి ,
తమ ఉనికి కోసమే మన భవితకు గోతులు...
వినుము కె.ఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
------------------------------------------------------------------
మనసొమ్ము వరాల జల్లులతో మనకు వెచ్చించి ,
నిధులలేమిచూపించి అంతులేని అప్పులుజేసి
రుణగ్రస్తులనుజేసి తప్పుకొందురు నాయకులు !
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము....!!
----------------------------------------------------------------
ఉద్యోగుల జీతాలు ఉదారముగా పెంచి
ఊరించి ..ఊరించి ..క్షీరాభిషేకములకు తలవంచి,
సంవత్సరాలు సాగదీసి సహనము పరీక్షింతురు
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము.....!!
-------------------------------------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి