తెలియక చేసి న తప్పును క్షమించవచ్చు ,
తెలిసి చేసిన తప్పుకు తప్పక శిక్ష పడాలి....!
తన తప్పును ఒప్పుకున్నవాడు సజ్జనుడు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
------------------------------------------------------------------
'నిద్ర సుఖం ఎరుగద'ని , పెద్దలమాట ....,
'నిద్రలేమి అనారోగ్యం 'అన్నది వైద్యులమాట !
సమయానికి నిద్రించి -లేవాలన్నది నామాట ....
వినుము కె.ఎల్వీ.మాట, నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
పద్దతిగా శ్రమించడం శరీరానికి ఆరోగ్యం,
'నడక ' దీనికి ఒక ప్రత్యేక సహజ మార్గం !
బద్దకానికి గుడ్బై చెప్పడం శ్రేయస్కరం .....
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
---------------------------------------------------------------------
తొలి సూర్యకిరణాలలో సేదదీరుట మంచిది ,
డి -విటమిను ప్రసాదిస్తుంది మనకి ప్రకృతి !
ఇది ఉచితమని అశ్రద్ధచేయుట తప్పు పౌరుడా ,
వినుము కె .ఎల్వీ .మాట ,నిజము సుమ్ము .....!!
---------------------------------------------------------------------
తలనొప్పి ,వళ్లునొప్పులు ,కడుపునొప్పికి .....
కారణాలు తెలుసుకుని వాడాలి నొప్పిబిళ్ళలు !
వైద్య సలహాలేకుండా అతితెలివి ప్రదర్శించకు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
--------------------------------------------------------------------
విందుభోజనాలకెళ్లి విపరీతముగా రుచిచూసి,
అజీర్ణబాధతో అల్లాడిపోనేల ,తల్లడిల్లనేల ?
రుచులు ఎన్నివున్నా మితముగా భుజియించు ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
---------------------------------------------------------------------
ప్రతిరుతువులో లభించు అన్నితాజాపండ్లు ,
ఆకుకూరలు -కాయగూరలు మెండుగా తినాలి ,
మూడు పూటలా మనసువుంచి తాగాలి చల్ల !
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
జీవనరాగం ...!! (వచనపద్యాలు) :-:-డా.కె.ఎల్.వి.ప్రసాద్,హన్మకొండ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి