నానీలు -రథం :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

ప్రకృతిలో మమేకంగా 
ఆరాధన 
కదిలే కొయ్యదైవాల
పవిత్ర రథం !

గుడి చుట్టూ 
అమరిన అంగళ్ళు
సామాన్యుల 
బ్రతుకు రథాలు!

ఆకారం లేని 
దేవుళ్లు చూస్తున్నారు
లోకం నైజం 
పెద్దపెద్ద కళ్ల తో !

కుండల్లో వండిన 
ప్రకృతి ఆహారo 
కాదా మరి 
దైవం ప్రసాదం !

బంగారం తో 
 రథం ఊడ్చితేనే 
కదిలేది మరి 
రాజుకు తగిన చీపురు!

అచంచల విశ్వాసం 
అనేక పద్ధతులు 
దైవమా మజాకానా? 
రథయాత్ర !

కిటకిటలాడే 
వాహనాలు,స్టేషన్లు 
సాగాలిగా 
బ్రతుకు యాత్ర !