-కన్నీటిచుక్క:- సత్యవాణి

 నీటి చుక్కకే విలువున్నదంటే
కన్నీటి చుక్కకు విలువకట్టే
షరాబు ఎవరు
దాని శక్తిని అంచనా కట్టగలిగేదెవరు
కన్నీటిచుక్క చరిత్రలను లిఖించింది
చరిత్రలను తిరగరాసింది
నేటికీ ఇంటింటా రాస్తూనేవుంది
ఎందరి తలరాతలనో మారుస్తునే వున్నది
ఇకపైనా మారుస్తూనేవుంటుంది