చేమకూర వేంకటకవి,అన్నదానం(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.

        చేమకూర వేంకటకవి:
కావ్య రచనల నలవోక కార్య ముగను
శాస్త్ర జ్ఞానమే దానికి శాఖ జేసి
పటిమ‌ గలిగిన‌ భావాల పాత్ర శుద్ధి
ప్రతిభ నిలిపిరి వేంకట కవన వర్యు
           :అన్నదానం:
అన్న దానము నిలుపును ఆశ జనుల
మిన్న ఆకొన్న వారికి మీదు ఫలము
కన్న వారికి సాయము కామ్య మగును
ఉన్న వారును చేసిన ఊట బావి

కామెంట్‌లు