పద్యాలు : -: జెగ్గారి నిర్మల-సిద్దిపేట

 కం:
తొలకరి చినుకులు కురియగ
పులకించి వెడలు పొలమరి భూమిని దున్నన్
తొలగింపజేయు కంపను
మలచును విత్తనమువేయ మరిమరి యెన్నో
కం:
రక్షయె జగతికి రైతును
రక్షించును సర్వజీవరాసులనెల్లన్
పక్షికి, గోజకు రక్షణ
భక్షించేపంటలెన్నొ బాగుగ దీయున్
కామెంట్‌లు