ఉన్నతమైన ఆదర్శం ..:=అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకప్పటి తమిళనాడు ముఖ్య మంత్రి అన్నాదొరై చమత్కారం కి పెట్టింది పేరు. ఎలక్షన్స్ టైం లో ముస్లింలీగ్ తరుఫున  పీర్ మహ్మద్  కన్యాకుమారి జిల్లాలో  అభ్యర్థిగా నిలబడ్డాడు. డబ్బు సేకరణ ప్రారంభించాడు.రేకు డబ్బాలతో వాలంటీర్లు తిరుగుతుంటే  జనం చిల్లర నాణాలు  వేస్తున్నారు. డబ్బాలో మోత వస్తోంది. అప్పుడు అన్నాదొరై  తనప్రసంగం ఇలా ప్రారంభించాడు "మీరు రేకుడబ్బాలో డబ్బు వేయండి. కానీ నాణాలచప్పుడుతో  సభకి అంతరాయం కలిగించకండి.నాణాలు బదులు కరెన్సీనోట్లువేయండి."ఆయన ఉపన్యాసం  ముగించినాక అన్ని రేకుడబ్బాలలో రూపాయల నోట్లు!ఆనాటి అన్నాదొరై  ప్రభావం అంత శక్తి వంతమైనది.