మా మాస్టారు.:-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఆ పల్లెటూరిలో అదొక ప్రాథమిక పాఠశాల. ఆంజనేయులు మాస్టర్ గారు ఆ స్కూల్ కి పెద్ద. టీచర్స్ అందరికి ఆయనంటే గౌరవం. ఆయన మన లెక్కలు చెప్పటంలో దిట్ట. ఎటువంటి ఇ ముద్దు పిల్ల వాడికైనా తేలికగా అర్థమయ్యేలా చెప్పారు. ఆ స్కూల్లో పిల్లలందరికీ ఆంజనేయులు మాస్టర్ అంటే ఎంతో గౌరవం అభిమానులు కూడా. స్కూల్ కి సెలవు పెడితే ఆయన రాని లోటు బాగా కనిపిస్తుంది. సాయంత్రం వదలగానే మాస్టారు ఇంటికి వెళ్లేటప్పుడు పండ్లు కూరగాయలు జున్ను పాలు లాంటివి తీసుకెళ్తే ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అనేవాళ్ళు. మా పెరట్లో కాసినవి. అమ్మ ఇచ్చి రమ్మంటే తెచ్చాను అనగానే సంతోషంగా తీసుకునే వాళ్ళు అలా మాస్టారికి పిల్లలకి మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. కేవలం చదువు చెప్పడం వరకే కాదు వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకోవటం మంచి నడవడిక కలిగి ఉండటానికి భారత రామాయణ ఇతిహాసాలు చెప్పి విద్యార్థులు మంచి పౌరులుగా ఆయన లక్ష్యం. ఆంజనేయులు మాస్టారు మాత్రం రిటైర్ అయిన సాయంత్రం ఇంటిదగ్గర పిల్లలకు పాఠాలు చెప్పేవారు పేద విద్యార్థులకు ఆయనే స్వయంగా ఫీజులు కట్టి ఇ చదివించేవారు ‌. చదువులు పూర్తి చేసుకుని విద్యార్థులంతా ఎటు వాళ్లు అటు వెళ్లిపోయారు. ఉద్యోగాలలో స్థిర పడ్డారు. ఆ సంవత్సరం పూర్వ విద్యార్థుల పరిచయం ఏర్పాటు చేశారు. ఆ స్కూల్లో లో ఉన్న విద్యార్థులంతా వచ్చారు. ఒకరు పరిచయం చేసుకున్నాం. నేను రాగానే ఆంజనేయులు మాస్టర్ గారి గురించి అడిగాను ఆయన పరిస్థితి వినగానే కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి వెంటనే ఇంటికి వెళ్లాను. మాస్టారు గారి భార్య సత్యవతమ్మ తలుపు తీసి ఎవరు బాబు అని అడిగింది. నేనమ్మా గోపీనాథ్ చిన్నప్పుడు మీ ఇంట్లో ఉండే చదువుకున్నాను మీ ఆశీర్వాదం వల్లనే ఇంతటి వాడిని అయ్యాను. మంచి ఉద్యోగం వచ్చింది త్వరగా మాస్టర్ గారిని చూడాలి అన్నాడు ఆతృతగా. వాళ్ళ మాటలు విని మంచం మీద నుంచి లేచి కూర్చున్నారు ఆంజనేయులు గారు. గోపీనాథ్ వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు. మాస్టారు నన్ను గుర్తుపట్టారా ఇప్పుడు ఇంతటి వాడిని అయ్యానంటే అంతా మీ దయ అన్నాడు. కళ్ళకు మసకలు వచ్చాయి గుర్తు పట్టలేక పోయాను నువ్వు ఇంత ఎత్తుకు ఎదిగావు అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంతోమంది ఆశ్రయం కోరి వస్తుంటారు వెళ్తుంటారు నీలాగా గుర్తుపెట్టుకుని వచ్చేవాళ్ళు తక్కువే అన్నారు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను మాస్టారు మీరు మా జీవితాలను చక్కదిద్దారు మంచి భవిష్యత్తు అందించారు మీతో మా అనుబంధం అంత తొందరగా తీరిపోయేది కాదు మీరు మాకు గురువులు పెద్దలు మీరు నేర్పిన విద్యాబుద్ధులు ఏమిచ్చినా మీరు తీరేది కాదు. అవకాశం వచ్చింది మీ రుణం తీర్చుకోవాలని ఉంది మీ కన్ను ఆపరేషన్ చేయించు తాను నా మాట కాదనకండి నేను నీ బిడ్డ లాంటి వాడిని అనుకోండి అంటూ మాస్టారి చేతులు పట్టుకున్నాడు గోపీనాథ్. నీ దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించినట్లు అవుతుంది వద్దన్నారు. కాదూ కూడదని పట్టుబట్టి మాస్టారికి కంటి ఆపరేషన్ చేయించి పూర్తిగా కోలుకునే వరకూ దగ్గరుండి సేవలు చేశాడు గోపీనాథ్. బిడ్డలు లేకపోయినా సొంత బిడ్డ కన్నా ఎక్కువగా అని పెట్టుకుని చూశావు అంటూ ఎంతో పొంగిపోయారు. ఇది నా గురుదక్షిణ అనుకోండి మీలాంటి మాస్టార్లు ఉండబట్టే మేమింకా సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తున్నాం. చిన్నప్పుడు చేరదీసి ఫీజులు కట్టి చదివించారు. ఇప్పుడిలా మీ రుణం తీర్చుకుంటున్నాను. మీలాంటి గురువులు ఉంటే విద్యార్థులు మంచి పౌరులుగా దిద్దుతారు. మీరు నేర్పిన అక్షరాలే మాకు జీవితానికి బంగారు బాటలు. ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఆలంబన లాంటిది ఈ బంధం అంటూ గోపి నాధుని అక్కున చేర్చుకున్నారు. ఆ సంతోషాన్ని స్నేహితులతో పంచుకొన్నాడు గోపీనాథ్.
కామెంట్‌లు