ఆకాశంలో నక్షత్రాల విరబూస్తాయి.
సరిహద్దుల్లో కొంచెం ఉన్న
మరణపు అంచుల లోంచి
అనుక్షణం అప్రమత్తమై
నీతి నిజాయితీ ఆత్మస్థైర్యం
అనే చమురు నింపుకొని
పోరాటమే ఊపిరిగా దేశం కోసం
వెలిగే దీపాలు వీర జవాన్లు
కన్నవారిని ఉన్న ఊరిని వదిలిపెట్టి
భుజాలపై తూటాల బరువు
మోస్తూ కోట గోడల్ని చేయించుకుంటూ
ఉగ్రవాదపు ఊపిరి తీసి రక్త దాహం రాక్షసుల్ని చీల్చి
భరతమాత రుణం తీర్చుకోవడానికి
ఈ పుణ్య భూమిపై పుట్టిన వీరులు మీరు
విచ్ఛిన్నకర శక్తుల నుంచి అమానుష చర్యలకు
బలైపోతున్న ప్రజాస్వామ్య
ఐక్యతను అభివృద్ధిని ఓర్వలేక బాంబు దాడులతో
భయానకం సృష్టించి భయభ్రాంతులను చేసి
పతనం చేయాలని పాల్పడే దుశ్చర్యలను తిప్పికొట్టి
వీరోచితంగా పోరాడిన సరిహద్దుల్లో జవాన్లు వీరే.
చివరి రక్తపు బొట్టు అర్పించి
తుది శ్వాస విడిచే వరకు
మరణంలో అమరత్వం పొందింది
మృతదేహాలను ముక్కలు చేసినా
ముష్కరుల సమూహాన్ని
తుదముట్టించి వరకు కంటికి కునుకు
దూరమైన రెప్పలు వాల్చకుండా
అనుక్షణం ప్రాణాలను ఘనంగా పెట్టి దేశం కోసం
ప్రాణాలు అర్పించే వీర జవాన్లు వీరు.
పరమ వీర చక్రాల బిరుదులు
అలంకరించుకుని నిత్యం నింగిలో వెలిగే ధృవతారలు.
జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
ఏ తల్లి కన్న బిడ్డలో మాతృభూమి
కోసం ప్రాణాలర్పించిన సైనిక శిఖామణులు.
అమరత్వం లో యుద్ధ వీర సైనికులు వీరే మన జవాన్లు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి