దాశరథి ధృవతార:-- మచ్చ అనురాధతెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 సీసమాలిక

వెంకటాచార్యుల వెంకటమ్మ కొడుకు
దాశరథీధృవతార మనకు,
కృష్ణమాచార్యులు కెరటమై నెదిరించె
నైజాము ప్రభువుల నైజమెరిగి,
మహనీయ భావాలు మందార కావ్యాలు
కలమెనా యుధమని కవితలల్లి,
ప్రజలను చైతన్య బాటన నడిపించి
అగ్నిధారనుబోసె యవని యంత,
తెలగాణ బిడ్డగా తేకువ  జూపించి
రుద్రవీణ రచించె రుద్రుడితడు,
పాలకులవినీతి ప్రజల దిక్కున నిలిచి
పోరాట మొనరించె పుణ్యుడితడు,
పలునుద్యమాలలో ప్రజలతోనే కమై
పలుమార్లు ఖైదీగ బంధియైరి,
ఓ నిజాము పిశాచి యోటమితప్పదు
నీ కని తెలిపిన నిర్భయుండు,
యెందాక నా పాట యేగునో యందాక
నగ్గి బెట్టెదనంచునడలు కొట్టె.
తేటగీతి
పదును పెట్టెను కలముకు  పండితుడుగ,
దొరతనానికి వ్యతిరేక తోరణముగ,
దివ్యమైనట్టి జ్ఞానియై దీప్తి నొసగె,
రాచరికమును యెదిరించె రాజునితడు,
తెలుగు ప్రజలకు కొండంత వెలుగు నితడు.

కామెంట్‌లు