వర్షాగమనం,శంకరుడు(తేటగీతి పద్యాలు)డా.రామక‌ కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

                వర్షాగమనం:
సుడులు తిరిగెను నీళ్ళలో సుధలు కురియ
ముడులు విడివడి గంగమ్మ  మురిసె దివిని
పుడమి పులకించి పోయెను పూల వోలె
కడలి సంతస మొందెను కార్తె వచ్చి
           :శంకరుడు:
దివ్య శంకర నామము దీప్తి చెంద
భవ్య శ్రీకర శంభుడు భావ మగును
శివుడు అభయం కరమగు శీఘ్ర గతిన
విష్ణు వల్లభు కరములు‌ వినుతి కెక్కె
కామెంట్‌లు