కష్టేఫలీ. అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా మనం అనుకుంటాం ఏమని?అంతా భగవంతుని దయ  పూర్వజన్మ సుకృతం అని.అది నిజమేకానీ మన ప్రయత్నం మనం చేస్తూదైవం పై భారంవేయాలి. భగవద్గీత లోఏముంది?నీధర్మం కర్తవ్యం  చేయి అని.గాలి లో దీపంపెట్టి దేవుడా  నీమహిమ  అనరాదు. 
మరి గ్రీస్ దేశం కి చెందిన  ఆ పిల్లాడు బీదవాడు.రోజూ కట్టెలు కొట్టడం  అందంగా మోపులా పేర్చి అమ్మగా వచ్చి న  డబ్బు తో గడిపేవాడు. రోజూ  ఆపిల్లాడిని చూస్తూ ఉన్న  వ్యక్తి  అడిగాడు "బాబూ  ఈమోపుని మళ్లీ  విప్పి కట్టగలవా?"ఓ అని ఆపిల్లాడు  దాన్ని విప్పి  చెల్లాచెదురుగా విప్పి పడేసి మళ్లీకట్టాడు.అంత చిన్న పనిని  ఎంతో శ్రద్ధ భక్తి తో చేసిన   అతనిని మెచ్చుకోలుగా చూసి "బాబూ!నేను నీకు చదువు చెప్తాను. ఆఖర్చుఅంతా నేను భరిస్తాను."అని తనవెంటతీసికుని వెళ్లాడు. ఆబాలుడే ప్రసిద్ధ గణితశాస్త్రంలో దిట్ట పైథాగరస్.   అతని కట్టెలమోపు చూసి  ముచ్చట పడిన ఆ గురువు  గ్రీక్ తత్వవేత్త డెమోక్రటిస్. బాలలో ప్రతిభను వెలికి తీసే గుణం  అమ్మా నాన్న  టీచర్స్ కి ఉం డాలి.
అమెరికన్ పారిశ్రామికవేత్త జాన్సన్   జపాన్ లో తన వ్యాపారం ప్రారంభించాడు. అక్కడి నియమంప్రకారం జపాన్ వారిని  నియమించాడు.వారు కష్టపడి పని చేస్తారు. వ్యాపారం జోరుగా సాగుతోంది. శని ఆదివారం  సెలవు ప్రకటించాడు.అంతా ఎదురు తిరిగారు."మాకు రెండు రోజులు సెలవు వద్దు. మేము సోంబేరులు బద్ధకస్తులుగా తయారు అవుతాము    అని వారి వాదన."మేము జల్సాల లో మునుగుతాము. అనేప్పటికి జాన్సన్  జీహుజూర్ అంటూ ఆదివారం  ఒక్క రోజు  సెలవు  ప్రకటించాడు. రెండో ప్రపంచయుద్ధం లో తమదేశం సర్వ నాశనమైనా  అగ్ని ప్రమాదంలు జరుగుతూనే ఉన్నా తమదేశం ని అభివృద్ధి పధంలో నడుపుతున్నారు. ఆంగ్లం రాదు.కొంత మంది ఇండియన్స్  జపాన్ అమ్మాయిలను చేసుకుని హిందీ నేర్పుతున్నారు. బౌద్ధ మత అవలంబకులు పక్కా శాకాహారులు.
కామెంట్‌లు