ఎవరికి ఎవరు ఎలా
సంకెలవేసినా ...
మొబైల్ అనేది ఇప్పుడు
అందరికి నిత్యజీవితంలో
అవసరమయిన అవసరాల్లో
అత్యాధునిక అవసరం ...!
అనుభవిస్తూనే
ఆడిపోసుకోవడం దుర్మార్గం
ఇదిముసుగేసుకున్న
మూర్ఖజనావళి వేదాంతం !
అతి ఎప్పుడూ ...
మంచికి చితిపేరుస్తుంది ,
సద్వినియోగం చేసుకుంటే
అది అదృష్టం !
దుర్వినియాగం ఎప్పుడూ
సర్వనాశనానికి
రాజమార్గం .....!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి