సూక్తిసుధ*: -*మిట్టపల్లి పరశురాములు
*తే.గీ*


మనిషి మారుటన్నదినిల-మాటకల్ల
ముసుగుతొలగించిజూడగా-మోసమంత
తెలిసి పోవునుసత్యము-తేటముగను
నిదియె నసలైన మర్మము-నిక్కముగను

కులముమతములుజాతులు-బలమటంచు
విర్రవీగరాదునెపుడు-వెర్రివాడ
కులము మతములకన్నను-గుణమెమిన్న
తెలసిమసలుకొనుముబాల-తెలుగుబిడ్డ


కామెంట్‌లు