పుల్లయిసు - బాల గేయం (మణిపూసలు ):---. ఎం. వి. ఉమాదేవి నెల్లూరు

గుర్తు ఉందా పుల్లయిసు 
బాల్యంలో మహా గడుసు 
ఎఱ్ఱెర్రని పెదాలతో 
తిట్లు తినడమేగ తెలుసు !

టాన్సిల్సు  వస్తాయంటు 
పెద్దోళ్ళు గొనుక్కొంటు 
కట్టడి చేసిన కూడా 
రహస్యంగా  కొనితింటు!

ఎరుపు పసుపు ఆకుపచ్చ 
అయిసు బండి చుట్టు రచ్చ 
అయిదు పైసలుకు రెండోచ్ 
అది  స్వర్ణ యుగం మెచ్చ!

ఏదయినా పెట్టవచ్చు 
అయిస్ మటుకు ఆపదొచ్చు
ఎంగిలి తినకూడదు అని 
తప్పించుకుంటరనొచ్చు !  

కామెంట్‌లు