అమ్మ,నాన్న అంటే ముద్దు:---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.


' అమ్మ ' అను పిలుపులో

అనురాగమున్నది

' నాన్న ' అను పిలుపులో

వెన్న ముద్దలున్నవి


' అత్త ' అను పిలుపులో

ఆత్మీయత ఉన్నది

' మామ' అను పిలుపులో

మమకారమున్నది


' అన్న' అను పిలుపులో

ఆనందమున్నది

' అక్క' అను పిలుపులో

అనుబంధమున్నది


' చెల్లి ' అను పిలుపులో

మల్లె తావి ఉన్నది

' తమ్ముడ'న్న పిలుపులో

తన్మయత్వమున్నది


ఆంగ్ల పదములలో

తీయదనమెక్కడ?

తెలుగు పదములలో

అమృతమే ఇక్కడ