కమనీయ కావ్య మాధుర్య త్రిలింగ
పరిమళ పదాoబుధి ప్రౌఢ తెనింగ భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
2)నవ్య మనోహర నవనీత శక్తి
జగతి జీవన ప్రభ కాంతుల
జ్ఞాన విజ్ఞాన విశ్వ ఖ్యాతి భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
3)అచ్చు హ్రస్వ దీర్ఘ వక్రతంబుల
ఉభయాక్షర పరుష సరళ స్థిరంబుల
అంతస్థ స్పర్శ వర్గాక్షర భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
4)విశేష జ్ఞాన విజ్ఞాన బండాగార
విజయ విఖ్యాత వినూత్న విశాల
విశ్వంబు సాటి మేటి సౌందర్య భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం !
5)మలయ మారుత మందార మకరంద
మహత్వ మంజరీ మృదుల మృదుత్వ
మహతీ మంజుష మల్లెల మాధుర్య భాష
వినరా బిడ్డా !మన తెలుగు వైభవం
: - చెన్నా సాయిరమణి
పెంట (గ్రామం ), పద్మనాభం (మండలం )విశాఖపట్నం (జిల్లా )
MA తెలుగు
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి