ప్రగల్భాలు: :- డాక్టర్ . కందేపి రాణి ప్రసాద్

 శరీరం కుళ్లిపోయి కంపు కొడుతున్న
సెంటు వాసన లు జల్లినట్లు
దేహం వడలి ఎముకల గూడు అయినా
పైన పట్టు బట్టలు తోడిగినట్లు
ఇంట్లో ఈగలు వాలుతున్న
బయట పల్లకి ఎక్కి తిరిగినట్లు
కడుపులో అన్నం లేక సుష్కిస్తున్న
పైకి పెళ్లి భోజనం తిని తేన్పులు తీస్తున్నట్లు
రాష్ట్రంలో కోవిడ్ మరణాలు లక్షల్లో ఉన్నా
గొప్పలకు పోయి వేలల్లో చూపిస్తున్నారు.

మనం చూపిన లెక్కల్నే తీసుకుని
ఆక్సిజన్ సిలిండర్లు,ఇంజెక్షన్ లు
వారు పంపిస్తే మరణాలు మరింత పెరిగే
రేమేడిసీవర్ లు ఆక్సిజన్ కొరతలతో
మన కన్ను మనమే పొడుచుకున్నాము.
ప్రగల్భాలు పలికే వాడెప్పుడు 
లోలోపల ఎడవక తప్పదు.

పనిలేని పస లేని ప్రచారాలు చేసుకున్టే
ఆర్భాటాలు హంగులకు పోయి
జీవితాలు నాశనం చేసుకుంటే
ఎవరికి నష్టం,ఎవరికీ కష్టం.
ఎవరూ సహాయం చేయలేదని
వగచి లాభం లేదు
మన కాళ్ళ కింద గొయ్యి
మనమే తవ్వుకున్నట్లు అయింది.

కామెంట్‌లు