బాలికా వధువుగాను
బాధ్యతలు మోసింది
దుర్గాబాయి తనచదువును
ఆసక్తితో కొనసాగించింది!
కాంగ్రెస్ సభలలోను
గాంధీగారిని చూసింది
పార్టీవిరాళాలుకు బంగారుగాజులను
ధీరతగా దూసిచ్చింది !
స్వాతంత్రోద్యమ కార్యకర్తగా
ఎనలేని సేవచేసింది
మహిళలు బాలలకోసంగా
సంపూర్ణ కృషిసల్పింది!
న్యాయశాస్త్రం చదివెను !
మద్రాస్ హైకోర్టులో,
లాయరుగా పనిచేసెను
ఆనాటి ఆంక్షలకాలంలో !
ఆంధ్రమహిళాసభ స్థాపనతో
చేతనమార్గం చూపింది
మహిళలకో పత్రికతో
అభ్యుదయo చాటింది !
సాక్షరతా భవనమును
వృత్తివిద్యా కేంద్రాలు
బాలలకోసం సంఘమును
స్థాపించగా ఉపయోగాలు!
సత్యాగ్రహ శిబిరాలకు
సాటిలేని నాయకురాలు
గాంధీమార్గం అనుసరణకు
అనునిత్యం విధేయురాలు!
సొంతజీవితం త్యాగము
కొంతవరకు పాటించారు
డాక్టరేట్ పద్మవిభూషణము
నెహ్రూలిటరరీ అవార్డులందారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి