పల్లె అందాలు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
గూటిలోని  కోడి పుంజు
చుక్క పొద్దుకు లేచింది
కొక్కర కో అని కూసింది
పల్లె ఉషోదయం మురిసింది

రైతన్న నిద్ర లేచాడు
భూ తల్లికి మ్రొక్కాడు
తూర్పు దిక్కు చూసాడు
సింధూర వర్ణ కాంతులను

వెదజల్లుతూ సూర్యుడు
అవని తల్లి పాపట బిల్లగ
దగ దగ మెరుపులతో
ఉదయించెను భానుడు

ఉదయ కిరణాల వెలుగుల్లో
పక్షుల కిలకిలా రాగాలతో
లేగదూడల అరుపులతో
మా పచ్చనైన పల్లె అందాలు