శ్రీ దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా.:-: మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

చంపకమాల.
1. తరమున పోరుసల్పెనిట  దాశరథీ తెలగాణ వీరుడున్ ,
కరమున ఖడ్గమై కలము గైకొని యక్షర సేద్యమున్ నిడన్ ,
శరములయగ్నిధార నిల శౌర్య ము తోడను కుమ్మరించెనే ,
వరముయె కృష్ణమార్యులును  పండిత  పామర  మానవాళి కిన్.

2.కనకము  రాష్ట్రమందితడు  కావలె గొప్పగ  వేడుకల్ని లన్ ,
జనములు  మెచ్చగా సమర శంఖమునూదెనుకావ్య సృష్టితో ,
మననము జేసుకోవలెను మా నస మందున కృష్ణమార్యు నిన్ ,
అనయము వందనమ్మిడి మ హాత్ముడు దాశరథిన్ ధరాస్థలిన్ .