బోనాల పండుగ* (బాల గేయం )పెందోట వెంకటేశ్వర్లు
ఆషాడ మాసంవచ్చింది
బోనాల పండుగ తెచ్చింది
గ్రామ దేవతలతో నిండింది
మరుసుతు బోనం చేసారు
కుంకుమ బొట్ట్లే  పెట్టారు

వేప కొమ్మలు తెచ్చారు
మడిగా అన్నం వండారు
భక్తిగా బోనం ఎత్తారు 
సిగాలు ఎన్నో వూగారు

పోతరాజు లే వచ్చారు
పలు విన్యాసాలను చేశారు
కల్లు  సాకలే  పోసారు
కొబ్బరి కాయలు కొట్టారు.